జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఎస్ ఆర్ వి( ఆక్స్ఫర్డ్) పాఠశాలకు చెందిన
విద్యార్థులు సోమవారం విడుదలైన టీజీ సెట్ ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ కచ్చకాయల సతీష్, ప్రిన్సిపాల్ దుద్దిల్ల దేవేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023- 24 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్షలో పాఠశాల నుండి 36 మంది
విద్యార్థులు, ప్రవేశ పరీక్షకు హాజరుకాగా 26 మంది
విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ గురుకులాలకు ఎంపికైనట్లు వారు తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా
ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.