జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో పది సంవత్సరాలు పైబడిన పిల్లలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం శ్రీలత ఆధ్వర్యంలో టీడీ వ్యాక్సినేషన్ పంపిణీ చేశారు. పిల్లల్లో వచ్చే కంఠవాపు, ధనుర్వాతం నిర్మూలనకు ఈ వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కచ్చ కాయల సతీష్ , ప్రిన్సిపాల్ దుదిల్ల దేవేందర్, ఉపాధ్యాయులు బండ్ల రాజు, రహమత్ పాషా, అరుణ, కావేరి, శివాని, స్రవంతి, ఆయా లక్ష్మి పాల్గొన్నారు.