కలెక్టర్ కు వినతిపత్రం అందించిన ప్రజాప్రతినిధులు

464చూసినవారు
కలెక్టర్ కు వినతిపత్రం అందించిన ప్రజాప్రతినిధులు
ములుగు జిల్లా వెంకటాపురం( రామప్ప) మండలంలో కురిసిన వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. వడగండ్ల వానల వల్ల, వరి, మొక్కజొన్న, మిర్చి, పంటలతో పాటు మామిడి తోటలకు భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. రామప్ప సరస్సు ఆయకట్టు కింద ఆలస్యంగా నాట్లు వేయడం వల్ల ప్రస్తుతం వరి పంట, చిరు పొట్ట, మరియు పొట్ట దశలో ఉందని, ఈ దశలో వడగండ్ల పడడం వలన వరి ఆకులు అన్ని రాలిపోయాయని, దాదాపు 30 నుండి 40% వరకు వరి పంట దెబ్బతిన్నదని, దీంతో 50 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సోమవారం నుండి అధికారులతో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కూరెళ్ల రామాచారి, వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్ కాసర్ల కుమారస్వామి, నర్సాపురం పి. ఎస్ చైర్మన్ మాడుగుల రమేష్, రైతు నాయకులు కంది యాదవ్ రెడ్డి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
Where: వెంకటాపూర్

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్