ప్రశాద్ పథకంలో రామప్పలో చేపట్టే పనులు ఇవే

1452చూసినవారు
ప్రశాద్ పథకంలో రామప్పలో చేపట్టే పనులు ఇవే
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట లో గల ప్రపంచ ప్రసిద్ధి చెంది యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఇటీవల సందర్శించిన భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 61. 99 కోట్ల రూపాయలతో చేపట్టే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో చేపట్టే పనులను సైట్ ఏ, సైట్ బి, మరియు సరస్సు సుందరీకరణ విభాగాలుగా విభజించారు. సైట్ ఏ నిర్మాణ పనుల్లో భాగంగా పది ఎకరాలలో 41. 17 కోట్లతో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టు, సావనీర్ షాప్స్, మల్టీ మోడల్ పార్కింగ్, ప్లే ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్ లో నిర్మించనున్నారు. సైట్ బి నిర్మాణ పనుల్లో భాగంగా 7. 97 కోట్లతో సుమారు 27 ఎకరాలలోగార్డెన్స్, పాత్ వే పనులను చేపట్టనున్నారు. రామప్ప సరస్సు సుందరీకరణకు ఈ పథకంలో 3. 33 కోట్లు కేటాయించారు. రామప్ప చెరువు కట్టపై చిల్డ్రన్ పార్కు, గార్డెన్, ఏర్పాటు చేయనున్నారు. పాన్ ఏరియా అభివృద్ధి కోసం 6. 5 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా సూచిక బోర్డులు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, జాతీయ రహదారిని అనుకోని స్వాగత తోరణం నిర్మించనున్నారు.
దీంతో భవిష్యత్తులో రామప్ప రూపురేఖలు మారనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్