ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు వద్ద సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు.