ములుగు నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా వాట్సప్ గ్రూపులు సోషల్ మీడియాలో "నాలుగో సింహం" రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందని ప్రచారం జోరుగా ఊపందుకుంది. దీంతో నియోజకవర్గమంతట ప్రజల్లో చర్చ నీయ అంశంగా మారింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లుచర్చ జరుగుతుంది. 25 సంవత్సరాలుగా పోలీస్అధికారిగా ఉద్యోగం చేస్తున్నఅజ్మీరా పెద్దన్న కుమార్ నాయక్ రా బోయే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూ పలు సామాజిక కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు తగిన సహాయం చేస్తూ నియోజకవర్గం ప్రజల్లో గుర్తింపు పొందారని, ఓ ప్రధాన రాజకీయ పార్టీ నుండి పోటీ చేసేందుకుఅవకాశం లభించనున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. విద్యావంతుడు నిజాయితీగల పోలీస్ అధికారి రాజకీయాల్లోకి వచ్చినట్లయితే భవిష్యత్తులో ములుగు నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, దీంతో ములుగు రాజకీయ ముఖచిత్రం మారనుందని విశ్లేషకుల అభిప్రాయం.