వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 31 అక్టోబర్ న గురువారం రోజున సివిల్ సప్లై గోదాం, వ్యవసాయ మార్కెట్ ముందు కార్మికులు ఏఐటియుసి 105 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపేల్లిమునీశ్వర్ పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు. కార్మికులకు మిఠాయిలు పంచారు. ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి సంపాదించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం వాటిని నాలుగు కోట్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చడం జరిగిందని తెలిపారు.