నర్సంపేట: గీత కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ

76చూసినవారు
నర్సంపేట: గీత కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు గీత కార్మికులకు శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. గీత వృత్తిదారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను అందిస్తుందని ఎమ్మెల్యే దొంతి తెలిపారు. కుల వృత్తుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్