నర్సంపేట: సీసీ రోడ్డు పనులపై ప్రజల నిరసన

83చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలోని విశ్వబ్రాహ్మణ వీధిలో పాత రహదారి వదిలేసి పక్కకు కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణాన్ని నిరసిస్తూ సోమవారం స్థానికులు ఆందోళన చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కోసం రహదారి నిర్మాణంలో మార్పులు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిం చారు. పనులను ఆపమని కోరినా నిర్మించడంతో కొందరు 100 నంబరుకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడి కొందరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అభ్యంతరం చెప్పిన వారు పోలీస్ స్టేషన్లో ఉండగానే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్