Mar 15, 2025, 06:03 IST/
గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్
Mar 15, 2025, 06:03 IST
TG: గత ప్రభుత్వంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు. బలహీన వర్గాలకు చెందిన మహిళా గవర్నర్ ఉంటే సూటి పోటి మాటలతో అవహేళన చేశారు. అసభ్యకరంగా తిట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయబోదు' అని అన్నారు.