AP: టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా జరిగింది. షరీన్‌నగర్‌కు చెందిన టీడీపీ నేత సంజన్నను గుర్తు తెలియని కొందరు వేట కొడవళ్లతో నరికి చంపారు. సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ కార్పొరేటర్‌గా పని చేసి సంజన్న.. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ప్రత్యర్థులే చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.