మాజీ మంత్రి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు

82చూసినవారు
మాజీ మంత్రి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని టీడీపీ దళిత నాయకులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువుల్లో కాకాణి గ్రావెల్ కొల్లగొట్టారని టీడీపీ నేతలు విమర్శించారు.

సంబంధిత పోస్ట్