Nov 05, 2024, 13:11 IST/
నటి కస్తూరిపై కేసు నమోదు
Nov 05, 2024, 13:11 IST
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరిపై తమిళనాడు ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. అఖిల భారత తెలుగు సమాఖ్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. '300 ఏళ్ల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్లే తెలుగువాళ్లు' అని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా ఆమె ప్రకటించారు.