నేడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి. 15 ఫిబ్రవరి 1739న కర్ణాటకలోని సురగొందనకొప్ప గ్రామంలో సేవాలాల్ జన్మించారు. బంజారాలకు హిందూధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా ఆయనను భావిస్తారు.సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.