కుంభమేళాలో మెరిసిన న్యాచురల్ బ్యూటీ మోనాలిసాకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. నీలి రంగు కళ్లతో కుంభమేళాలో పూసలమ్ముతూ కనిపించిన ఈ భామ.. ఓవర్‌నైైట్‌లో స్టార్‌గా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆమె రేంజే మారిపోయింది. తాజాగా కేరళలోని ఓ జ్యువెలరీ షాపింగ్ మాల్ వేడుకకు హాజరయ్యారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు మాల్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేసి, మోనాలిసా డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.