మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తోరూర్ మండలం నూతన కమిటీని శనివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్వ అధ్యక్షుడు ఎండీ మాలిక్ ఆధ్వర్యంలో జరిగిన సంఘం మండల సర్వసభ్య సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సిరికొండ విక్రమ్ కుమార్ సభ్యుల ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షులుగా కాసోజు సాయినాథ్ చారి, ప్రధాన కార్యదర్శిగా కోటగిరి సంతోష్ గౌడ్, కోశాధికారిగా ఎండీ షరీఫ్ లతో పాటు కార్యవర్గం, మరియు గౌరవ సలహాదారులు అబ్బనపురి పూర్ణాచారి, కొత్త వెంకట్ రెడ్డి లు ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సాయినాథ్ మాట్లాడుతూ సంఘ సభ్యులు, పూర్వ కమిటీ సహాయ సహకారాలతో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.