గుర్తూరు మోడల్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
గుర్తూరు మోడల్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుర్తురు మోడల్ స్కూల్లో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మొదటగా ప్రిన్సిపల్ సునీత మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివితే ఉన్నతమైన శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు దేశం పట్ల భక్తి భావనను కలిగి ఉండి దేశాభివృద్ధి కోసం నిత్యం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాలకు చెందిన విద్యార్థులు చేసిన మార్చి ఫాస్ట్, అద్భుత విన్యాసాలను చూసి ప్రజలు చప్పట్లతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోత్కూరు రవీంద్ర చారి,ఎంపీటీసీ మాధవి రమేష్,ఉప సర్పంచ్ సుజాత,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్