కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం జనగాం జిల్లా దేవరుప్పుల మండలం చింతబాయి తండా వద్ద జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మాదాపురానికి చెందిన పందెనబోయిన మల్లేష్ (47) అక్కడికక్కడే మృతి చెందగా పేరపు రామకృష్ణ (34), ధర్మాపురం గ్రామానికి చెందిన దౌపాటి అనిల్ (27)కు తీవ్రగాయలైనట్లు ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు.