పాలకుర్తి మండలం బమ్మెర శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో మంగళవారం టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.1,29,540 ల నగదు, 6 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ తెలిపారు. ఈ దాడిలో స్థానిక ఎస్సై లింగారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్సై లు ఉన్నట్లు తెలిపారు.