భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుగులోకి అనువదించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. మంగళవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దయాకర్ రావు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసిన ఎడిటర్ వరుణ్ కుమార్ ని సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందీప్ లు పాల్గొన్నారు.