విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని ప్రొఫెసర్ డాక్టర్ చందా మల్లయ్య, గాంధీ హాస్పటల్ హైదరాబాద్ డాక్టర్ అరుణ్ రెడ్డి లు అన్నారు. బుధవారం తొర్రూర్ పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ నలంద విద్యాసంస్థలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను బయటికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం వలన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రస్థానానికి చేరడంలో తోడ్పాటునందిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం, ప్రిన్సిపల్ రవీందర్ అకాడమిక్ డీన్ యాకన్న ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.