కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రైతు చట్టాలపై ప్రతిపక్షాల విష ప్రచారం సరి కాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో రైతు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రైతు చట్టాలపై ప్రతిపక్షాల విష ప్రచారం తిప్పి కొడుతూ గ్రామ గ్రామానికి బిజెపి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించేలా బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని, గత 70 ఏళ్ళుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వాటిని అధిగమిస్తూ రెైతులు తమ పంటలను తామే ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా ఈ చట్టంలో రూపొందించారని, రైతును రాజును చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని తెలిపారు.
రైతులు తమ పంటలకు సరియైన ధర వచ్చే వరకూ పంటలను నిల్వ చేసుకునే విధంగా గ్రామ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ లను నిర్మించబోతున్నదని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రణాళిక ప్రకారం ఈ చట్టాలు అమలు చేస్తున్నారని, రైతులంతా ఈ చట్టాలను స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు వ్రాస్తుంటే ప్రతిపక్షాలు విష ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నెమరుగొమ్ముల వెంగళరావు, బీజేపీ నాయకులు పల్లె కుమార్, పి.రాంమోహన్ రెడ్డి, బి.సురేష్, పి.శ్రీమాన్, రవిబాబు, వెంకన్న, సాగర్, నవీన్, రాజకుమార్, సతీష్, సారయ్య, నవీన్, మురళి, కె.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.