Oct 13, 2024, 00:10 IST/వర్ధన్నపేట
వర్ధన్నపేట
పండుగ వేళా నిబంధనలకు తూట్లు
Oct 13, 2024, 00:10 IST
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ పట్టణ కేంద్రంలో ఉన్న మద్యం షాపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం7 గంటలకి అన్నారంలో రెండు మద్యం షాపులు ఓపెన్ చేశారు. దీంతో స్థానిక యూత్ సభ్యులు షాపుల ముందుకు వెళ్లి అడగగా వెంటనే షాపులు క్లోజ్ చేసి తిరిగి మళ్ళీ షాపులు ఓపెన్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామస్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.