Oct 13, 2024, 11:10 IST/జనగాం
జనగాం
ప్రొఫెసర్ సాయిబాబ మృతి విప్లవోద్యమాలకు తీరని లోటు
Oct 13, 2024, 11:10 IST
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతి భారత విప్లవోద్యమాలకు తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య అన్నారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో సాయిబాబా చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.