కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి రోజు జంబూ సవారీని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మైసూరు రాజవంశ దేవత చాముండేశ్వరీ విగ్రహాన్ని మోసుకుంటూ 'అభిమన్యు' ఏనుగు రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. దేవతామూర్తికి సీఎం సిద్ద రామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక వారసత్వ సంపద, రాజవంశ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకలు జరిగాయి.