Sep 19, 2024, 03:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు: మంత్రి
Sep 19, 2024, 03:09 IST
చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టిని సారించారని, అభివృద్ధి చేయడం కోసం అందరూ సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కోరారు.