ఈనెల 28 న రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర సదస్సు

581చూసినవారు
ఈనెల 28 న రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర సదస్సు
జఫర్గడ్ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కనుమరుగు చేసేందుకు కుట్రలో భాగంగా కేసీఆర్ కొత్త రాజ్యాంగాన్ని రాయాలని మాట్లాడుతున్నారన్నారు. ఈ నెల 28న జరిగే రాష్ట్ర సదస్సుకు ఎం ఆర్ పి ఎస్ ఎం ఎస్ పి మహా జననేత వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొంటారన్నారు. కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తాటికాయల హరి కృష్ణ మాదిగ అశోక్ మాదిగ ప్రసాద్ మాదిగ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :