అంగన్వాడి కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
By రాజీ 83చూసినవారుఅంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలను బాలింతలు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి లోని అంగన్వాడీ 1, 2 కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులు వివరాలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.