వాజేడు: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన నలుగురు యువకులు గంజాయి సేవించడంతోపాటు అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 1, 27, 750 విలువగల ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. యువకులు గంజాయి మత్తు వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సీఐ బండారి కుమార్ సూచించారు.