వెంకటాపూర్: ఉద్యోగ రీత్యా బదీలీలు సహజం.. ఐఎన్ టియుసి 327 నాయకులు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో బదీలీపై వెళ్తున్న ఏఈ సురేష్, ఎల్ఐలు వెంకట్ రెడ్డి, సమ్మిరెడ్డి, లైన్ మెన్ వేణు గోపాల్ రెడ్డిని బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇంజనీర్ సాంబరాజు అధ్యక్షత వహించగా, ఐఎన్ టియుసి 327 జిల్లా అధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి ఉదయ భాస్కర్ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను, రైతు సమస్యలను పరిష్కరించడంలో కృషి చేసిన అధికారుల సేవలను కొనియాడారు.