గుంటూరుపల్లిలో విష జ్వరంతో మహిళ మృతి
విషజ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గుంటూరుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటాపూర్ మండలం గుంటూరుపల్లికి చెందిన రమ (45) విష జ్వరం సోకి చికిత్స పొందుతూ మృతి చెందిందని బుధవారం స్థానికులు తెలిపారు. కాగా మృతురాలికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త గతేడాది వడదెబ్బకు గురై మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.