వెంకటాపూర్ మండలంలో కురుస్తున్న వర్షం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో మంగళవారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తమయ్యారు. వర్షాల వల్ల పంటలకు చీడపీడలు ఆశించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.