వరంగల్: మొక్కజొన్నలో పెరుగుతున్న కత్తెర పురుగు ఉదృతి

77చూసినవారు
వరంగల్: మొక్కజొన్నలో పెరుగుతున్న కత్తెర పురుగు ఉదృతి
వరంగల్ మమూనూరూ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ఖిల్లా వరంగల్ మండలంలోని దత్తత గ్రామలైన తిమ్మాపూర్, అల్లిపూర్ గ్రామాల్లోనీ మొక్క జొన్న పంటలలో క్షేత్రస్థాయి సందర్శనలు మంగళవారం నిర్వహించారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఉదృతి గమనించారు. కొంత మంది రైతులు ఇప్పటికే మొక్కజొన్న పంట విత్తుకోగా పంట 10-15 రోజుల దశలో ఉన్నాయి. ఇప్పటికే కత్తెర పురుగు ఆశించి నష్టపరచడం మొదలు పెట్టింది.

సంబంధిత పోస్ట్