సైన్స్ సహాయంతో సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చని వరంగల్ వాగ్దేవి ఫార్మసీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శ్రీ నలంద పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడమే కాకుండా దేశానికి అవసరమయ్యే ఎన్నో కొత్త ఆవిష్కరణలు కనిపెట్టబడి సమాజ హితానికి తోడ్పాటును అందిస్తాయని తెలిపారు.అనంతరం వివిధ తరగతుల వారు తయారుచేసి ప్రదర్శించిన 142 వైజ్ఞానిక నమూనాలను ఆయన తిలకించి నమూనాలను గురించి ప్రశ్నలు సంధించి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైజ్ఞానిక ప్రదర్శనలను ఆసక్తితో తిలకించి విద్యార్థులను అభినందించారు. కాగా ప్రదర్శన లో ఉత్తమంగా నిలిచిన వైజ్ఞానిక నమూనాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాక ప్రత్యేక బహుమతుల ను ముఖ్య అతిధుల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్,డిస్టిక్ అడ్మిషన్ ఇంచార్జ్ బి ప్రభాకర్,డీజీఎం చేతన్, ఆర్ఐ రాoకి, జెడ్ ఏసి మహేష్,అకాడమిక్ డీన్ యాకన్న, ఏవో యాకన్న ,ప్రైమరీ ఇంచార్జ్ అశ్విని, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శ్వేతా రెడ్డి,ఉపాధ్యాయులు రాము,వెంకన్న,స్వాతి తదితరులు పాల్గొన్నారు.