పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకల్లో’ భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం రాత్రి మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపాలను వెలిగించి, ఇతర భక్తులతో కలిసి వాటిని నీటిలో వదిలారు. రుద్రపూజ, బిల్వపత్ర పూజ మొదలైన ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు.