మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెం గ్రామానికి చెందిన 8 మంది ,ఇటీవల కురవి మండలంలోని సోమల తండా వద్ద గ్రానైట్ లారీ ఆటో మధ్యలో పడి మృతి చెందిన వారి కుటుంబానికి ఆదివారం డోర్నకల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ,ఓదార్చి ప్రగాడ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆర్దిక సహాయం గా 15 వేలు అందచేసారు. తమకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు నాయకులు పెద్దలు పాల్గొన్నారు.