వరంగల్ ఉర్సు ప్రాంతంలో గేదెలు చోరీకి గురయ్యాయి. కుమ్మలకుంట కొత్తవాడకు చెందిన పేరబోయిన సమ్మయ్య ఆగస్ట్ 22న ఉర్సు గుట్ట పరిసరాల్లో అయిదు గేదెలను మేతకు వదిలారు. భోజనం చేసి వచ్చేలోపు గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తీసుకెళ్లారని ఆదివారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు. వాటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని తెలిపారు.