వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంగసాయిపేట, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో పర్యటించి ఆశా డే కార్యక్రమాన్నిరివ్యూ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ప్రభుత్వం సూచించిన నిర్దేశాలకు అనుగుణంగా ఆశా కార్యకర్తల నుండి వైద్యాధికారుల వరకు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించి, జిల్లాను ఆరోగ్య జిల్లాగా మార్చాలని సూచించారు.