Nov 22, 2024, 08:11 IST/
తెలంగాణ గవర్నర్ కీలక పిలుపు
Nov 22, 2024, 08:11 IST
TG: భారత సంస్కృతికి ఎన్నో కుట్రలను తట్టుకుని నిలబడిన ఘనమైన చరిత్ర ఉన్నదని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తెలిపారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన లోక్ మంథన్ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశీ కుట్రలు తట్టుకుని నిలబడిన మనం.. ఐకమత్యంతో, సామరస్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నో రంగాల్లో భిన్నత్వంలో ఏకత్వమున్న దేశం మనదేనని ఆయన వ్యాఖ్యానించారు.