Oct 09, 2024, 02:10 IST/
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఉగ్రవాద బాధితురాలు
Oct 09, 2024, 02:10 IST
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఏకైక మహిళా అభ్యర్థి షగున్ పరిహర్(29) విజయం సాధించారు. కిష్టవార్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్అభ్యర్థి, మాజీ మంత్రి సజాద్ అహ్మద్ కిచ్లూపై 521 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఉన్నత విద్యావంతురాలైన షగున్ పరిహర్ ఉగ్రవాద బాధితురాలు. 2018 నవంబర్లో ఉగ్రవాదుల దాడిలో ఆమె తండ్రి అజిత్ పరిహర్, చిన్నాన్న అనిల్ పరిహర్ ప్రాణాలు కోల్పోయారు.