ఈ నెల 28న భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభించేందుకు జిల్లా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్లో బోటింగ్ ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ముందుగా భద్రకాళి చెరువులో బోటింగ్ ప్రారంభించనున్నారు. 30 మంది సామర్థ్యం కలిగిన బోటును తెప్పించారు. బోటింగ్ కు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చార్జీగా నిర్ణయించారు. ఈనెల 28న ఎమ్మెల్యే వినయ్ ప్రారంభిస్తారు.