భూపాలపల్లి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బస్సు సౌకర్యం

3714చూసినవారు
భూపాలపల్లి నుంచి శంషాబాద్  విమానాశ్రయానికి బస్సు సౌకర్యం
ప్రయాణికుల కోరిక మేరకు వారి సౌకర్యార్థం భూపాలపల్లి నుంచి హనుమకొండ మీదుగా హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం, శంషాబాద్ కు కొత్త సూపర్ లగ్జరీ బస్సును నదువుతున్నట్లు టీస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ జాస్తి శ్రీలత తెలిపారు. ఈ సర్వీసు భూపాలపల్లి నుండి ఉదయం 5: 00 గంటలకు బయలుదేరి హనుమకొండకు 06. 30 గంటలకు చేరుకుంటుందని, హనుమకొండ బస్టాండ్ నుండి 07. 00 గంటలకు బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి 10: 25 గంటలకు చేరుకుంటుందని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్