ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన పాలకుర్తిలో సీపీఐ (ఎం ఎల్) ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఐలమ్మ చిత్ర పటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ రాజా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ వీరోచిత పాత్ర పోషించారని కొనియాడారు.