అన్నదాతలకు అండగా సీఎం
కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని, రైతు సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మంగళవారం వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు కూడలిలోని వినయ్ గార్డెన్ లో రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఖిలా వరంగల్ మండలానికి చెందిన 362 మంది రైతులకు రూ. 2.65 కోట్ల విలువగల చెక్కులను పంపిణీ చేసారు.