హైదరాబాద్లోని రవీంద్రభారతి కంటే భిన్నంగా కాళోజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 1, 180 మందికి సరిపడా ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్స్ రూం, ఫస్ట్ ఫ్లోర్ లో ప్రీ ఫంక్షన్స్ వేదిక, ఆఫీస్ రూంలు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, రెండో అంతస్తులో లైబ్రరీ, ఆఫీస్, మూడు, నాలుగో అంతస్తులో ఫంక్షన్స్ హాల్స్ ఉన్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రాన్ని ప్రారంభోత్సవం చేశారు.