రాష్ట్ర ప్రజలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు శుక్రవారం సాయంత్రం తెలిపారు. హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక ప్రపంచానికి గణేషుడుప్రథమ పూజ్యుడని మంత్రి సురేఖ అన్నారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భక్తులు వినాయకుడిని పూజిస్తారని మంత్రి సురేఖ పేర్కొన్నారు.