మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ పసునూరి దయాకర్ అధికారులకు సూచించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు మంజూరయిన పథకాలు, నిధులపై జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పథకాల అమలు తీరుపై ఎంపీ పసునూరి దయాకర్ సమీక్షించారు.