హనుమకొండ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం లేపాయి. కాకతీయ యూనివర్సిటీ వెనుక ప్రాంతంలోని చెట్ల మధ్యలో గుర్తుతెలియని దుండగులు శుక్రవారం క్షుద్ర పూజలు చేశారు. మేకను, నల్లకోడిని బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. స్థానికులు చూసి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.