హనుమకొండలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి. సాంబ రెడ్డి తెలిపారు. వడ్డెపల్లి చర్చి, పరిమల కాలనీ, ఆర్టీసీ కాలనీ, సప్తగిరి కాలనీ, పూరి గుట్ట, పోలీసు కాలనీ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.