అధికారులతో వరద నష్ట అంచనా పై సమీక్షా

54చూసినవారు
అధికారులతో వరద నష్ట అంచనా పై సమీక్షా
భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సమావేశమై వర్షాల వల్ల జరిగిన నష్టం, బల్దియా వ్యాప్తంగా మంచినీటి సరఫరా తదితర అంశాలపై డివిజన్ల వారీగా అధికారులతో సమీక్షించారు. ఇళ్లు రహదారులు మంచి నీటి సరఫరా పైప్ లైన్లు తదితర నష్టాలపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్